![]() |
![]() |

ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ పై చెఫ్ మంత్ర సీజన్ 3 మంచి జోష్ తో మంచి రేటింగ్ ని సంపాదించుకుంది. ఈ సీజన్ కి మెగా ఫామిలీ నుంచి నీహారిక హోస్ట్ చేసింది.. ఇక నెక్స్ట్ వీక్ గెస్టులుగా రాహుల్ సిప్లిగంజ్, హేమచంద్రా ఎంట్రీ ఇచ్చారు. "నువ్వు పెద్ద పులి" సాంగ్ కి వస్తూనే డాన్స్ చేస్తూ వచ్చారు. "నేను మా డాడీ మీతో చాలా పాటలు పాడిద్దామని ఫిక్స్ అయ్యాము" అని నీహా హేమచంద్రతో చెప్పేసరికి "మేమిద్దరం వచ్చింది మీతో పాడిద్దామని" అని రివర్స్ కౌంటర్ వేసాడు హేమచంద్ర. "అప్పుడు ఆహాకి ఇదే లాస్ట్ ఎపిసోడ్ అవుతుంది" అంటూ సెటైర్ వేసింది నీహా. "ఈ ఇయర్ పంచాంగం చూసుకుంటారా" అనేసరికి "పంచాంగం చూసుకోకుండానే బాగుంటుంది నా ఇయర్." అని చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్.
తర్వాత కొన్ని కొంటె క్వశ్చన్స్ ఇచ్చింది నేహా.. "మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో డాష్ చేయడానికి ఇష్టపడతారు" అని రాహుల్ ని అడిగేసరికి "ఎవడీ క్వశ్చన్ రాసింది" అని స్వీట్ గా సీరియస్ అయ్యాడు. "మీరు డాష్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు" అని హేమచంద్రని అడిగేసరికి తెగ నవ్వేసుకున్నాడు. తర్వాత నీహాను చూస్తూ రాహుల్ "బొమ్మను చేస్తే నీలా ఉంది" అని పాటేసుకున్నాడు. దానికి నీహా "ఈ బొమ్మను ఎవరైనా సంపేయండిరా" అని సరదాగా సెటైర్ వేసింది. ఇక రాహుల్ గులాబీ జామున్ చేసి పెట్టేసరికి "నీకు ఇంత వంట వచ్చని తెలిస్తే అమ్మాయిలంతా క్యూలు కడతారు రేపు మీ ఇంటి దగ్గరకు ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక " అని చెప్పింది నీహా. "ఎందుకు వంట చేసిపెట్టమనా" అని సెటైర్ వేసాడు రాహుల్. తర్వాత "ఏ బిడ్డా ఇది నా అడ్డా" అనే సాంగ్ పాడారు హేమచంద్ర, రాహుల్ సిప్లి. ఇలా ఈ వారం ఈ ఎపిసోడ్ ఎంటర్టైన్ చేయబోతోంది.
![]() |
![]() |